
కొద్దికాలంగా ఇండస్ట్రీ పెద్దల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారిన శ్రీరెడ్డి. ఇన్నాళ్లు ఛానెల్స్ ఇంటర్వ్యూస్ లో మాత్రమే వారిని టార్గెట్ చేసింది. అయితే తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు ఇవ్వట్లేదన్న బాధతో తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరుగకూడదని తెగించేసింది శ్రీరెడ్డి. పనిలో పనిగా మా సభ్యులను ఏకి పారేసింది.
ఒక సినిమాలో నటిస్తేనే మెంబర్ షిప్ ఇస్తారని తాను 3 సినిమాల్లో నటించినా తనకు మెంబర్ షిప్ ఇవ్వలేదని అన్నది. నిర్మాతల ముందు విప్పి చూపించానని.. ప్రజలు ముందు విప్పితే వారు చూస్తారని అన్నది. మొన్న జరిగిన ఇంటర్వ్యూలో తనకు న్యాయం జరుగకపోతే ఫిల్మ్ చాంబర్ ముందు న్యూడ్ గా నిలబడతా అన్న మాట ప్రకారం ఈరోజు శ్రీరెడ్డి ఫిల్మ్ చాంబర్ ముందు సెమీ న్యూడ్ తో బైటాయించింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక త్వరలోనే రెడ్డిగారి గానా బజానా కార్యక్రమం రివీల్ చేస్తానని అన్నది శ్రీరెడ్డి.