వైఎస్సార్ బయోపిక్.. యాత్ర కాన్సెప్ట్ పోస్టర్..!

దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా యాత్ర. విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు సంబందించిన థీం పోస్టర్ పీఆర్వో బి.ఏ రాజు ట్విట్టర్ లో షేర్ చేశారు. యాత్ర టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో వై.ఎస్.ఆర్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. 


కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది అనే మాటలను కూడా పోస్టర్ మీద ఉంచారు. చూస్తుంటే ఇది రెగ్యులర్ బయోపిక్ లకు భిన్నంగా ఉండబోతుందని మాత్రం చెప్పొచ్చు. సినిమాలో మిగతా కాస్ట్ కూడా స్టార్స్ ఉండే అవకాశం ఉందట. పాదయాత్రతోనే ప్రజల మనసులను గెలుచుకున్న మహానాయకుడి బయోపిక్ ఎలాంటి సంచలనం కాబోతుందో చూడాలి.



థీం పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఆనందో బ్రహ్మ సినిమా తీసి హిట్ అందుకున్న ఈ చిత్రయూనిట్ మహా నేత చరిత్రను సినిమాగా తీస్తున్నారు.