
క్యారక్టర్ ఎలాంటిదైనా సరే దానికి తగ్గ బాడీ షేప్ సిద్ధం చేసుకోవాల్సిందే. స్టార్స్ అయితే ఆ విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్, రానా ఎన్నో వర్కవుట్స్ చేశారు. ఇక ఇప్పుడు ఆ వంతు ఎన్.టి.ఆర్ ది అయ్యింది. జై లవ కుశ తర్వాత త్రివిక్రం సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమా కోసం వర్కవుట్స్ చేస్తున్నాడు.
కాస్త బరువు పెరిగినట్టు డౌట్ వచ్చిందో లేదో అలా తగ్గించే ప్రయత్నం చేశాడు ఫైనల్ గా అనుకున్న వెయిట్ లాస్ కూడా సాధించాడు. ఈమధ్యనే ఎన్.టి.ఆర్ వర్కవుట్స్ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఈరోజు మాత్రం ఎన్.టి.ఆర్ గట్టిగా అరుస్తూ ఇచ్చిన స్టిల్ బయటకు వచ్చింది. క్యారక్టర్ కోసం బాడీ ఫిట్ గా ఉంచేందుకు తారక్ ఎంత కష్టపడుతున్నాడో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.