నాచురల్ స్టార్ పై శ్రీరెడ్డి ఎటాక్..!

కొద్దిరోజులుగా ఇండస్ట్రీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారిన హీరోయిన్ శ్రీరెడ్డి ఇప్పుడు మరింత రెచ్చిపోతుంది. శ్రీరెడ్డి లీక్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో హీరోలు దర్శకుల మీద కామెంట్లు గుప్పిస్తుంది. మొన్నామధ్య కొమ్ములున్న శేఖరుడు అంటూ శేఖర్ కమ్ముల మీద ఫైర్ అయిన శ్రీరెడ్డి నిన్న ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరాం చంద్ర తనతో చేసిన వాట్స్ అప్ చాట్ రివీల్ చేసింది.

అంతేకాదు శ్రీరెడ్డి ఇప్పుడు నాచురల్ స్టార్ నానిని టార్గెట్ చేయడం విశేషం. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా నాని నాచురల్ గా నటిస్తాడని అన్నది. అంతేకాదు మహేష్, రాం చరణ్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోలకు లేని యాటిట్యూడ్ నానికి ఉందని. అతనివల్ల చాలా మంది బాధపడ్డారని వారి ఉసురు తప్పకుండా తగులుతుందని అంటూ ఫేస్ బుక్ లో నాని మీద విమర్శలు చేసింది శ్రీరెడ్డి.

ఓ వారం క్రితం శ్రీరెడ్డి, మాధవి లత ఇంటర్వ్యూస్ చూసి నాని ఇప్పటికే చాలా ఎక్కువైంది లిమిట్ క్రాస్ చేయొద్దు.. పిల్లలు చూస్తున్నారని వార్నింగ్ ఇచ్చాడు. అయితే వారం తర్వాత శ్రీరెడ్డి నాని మీద కామెంట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.