వెంకటేష్ తేజా.. ఇక కష్టమే బాసు..!

గురు తర్వాత వెంకటేష్ అసలైతే కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సింది అది కాస్త అటకెక్కింది. ఈలోగా వెంకటేష్ తేజ కాంబినేషన్ లో ఆటా నాదే వేటా నాదే ఎనౌన్స్ మెంట్ వచ్చింది. మొన్నామధ్య ఆ సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. అయితే ఈలోగా తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆగష్టు కల్లా ఈ బయోపిక్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

చూస్తుంటే తేజతో వెంకటేష్ సినిమా కూడా ఆపేశారన్న టాక్ వస్తుంది. అందుకే అనీల్ రావిపుడితో ఎఫ్-2 (ఫన్ & ఫ్రస్ట్రేషన్) సినిమా లైన్ లోకి తెచ్చాడట వెంకటేష్. అయితే వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. మరి ఆ సినిమా పూర్తయ్యే దాకా వెంకటేష్ మళ్లీ ఖాళీగా ఉండాల్సిందే అని తెలుస్తుంది.