
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడు తన ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తుంటాడు. మిగతా హీరోలంతా సినిమా ఎనౌన్స్ మెంట్ మాత్రమే ఇచ్చి మిగతా వన్ని గోప్యంగా ఉంచుతారు. కాని బన్ని మాత్రం సినిమా ఓపెనింగ్ రోజే టైటిల్ ఎనౌన్స్ చేసి సూపర్ హిట్ కొడుతుంటాడు. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా చేస్తున్న బన్ని ఆ సినిమాకు సంబందించిన డైలాగ్ ఇంపాక్ట్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
బన్ని బర్త్ డే ఈ నెల 8న ఆ డైలాగ్ ఇంపాక్ట్ రిలీజ్ చేస్తారట. ముందు టీజర్ ఆ తర్వాత పాటలతో హోరెత్తించిన అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాపై ఫుల్ కాన్ ఫి డెంట్ ఉంటున్నాడట. వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బన్ని సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 4న గ్రాండ్ గా రిలీజ్ అవనుంది.