బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ తో పాటుగా RRR అంటూ సర్ ప్రైజ్ చేశాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేయబోయే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ముందు 150 కోట్ల దాకా బడ్జెట్ ఉండొచ్చని అనుకోగ ఇప్పుడు అది కాస్త 200 నుండి 250 కోట్ల దాకా వెళ్లిందట.
ఇంచుమించు ఇది కూడా మరో బాహుబలి అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. సైన్స్ ఫిక్షన్ సినిమా అంటూ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు సరికొత్త మేకోవర్ తో కనిపిస్తారట. ప్రస్తుతం బోయపాటి సినిమాతో రాం చరణ్, త్రివిక్రం సినిమాతో ఎన్.టి.ఆర్ ఇద్దరు బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలు పూర్తి చేసుకున్నా అక్టోబర్ లో మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్తుంది.