కేరాఫ్ కంచరపాలెం.. మరో పెళ్లిచూపులు..!

న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపికైన తెలుగు సినిమాగా కేరాఫ్ కంచరపాలెం సరికొత్త రిలార్డ్ సృష్టించింది. నటీనటులంతా కొత్తవారితో వెంకటేష్ మహా డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా విభిన్న కథాంశంతో తెరకెక్కిందట. సినిమా చాలా రియలిస్టిక్ గా సాగుతుందని అంటున్నారు. అందుకే విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికయ్యింది.


అంతేకాదు ఈ ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఇది కూడా మంచి సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే సిని ప్రముఖులకు ప్రివ్యూ వేసి సినిమా చూపించారట. రానా స్పెషల్ గా ఈ సినిమాను మెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. పరుచూరి విజయ ప్రవీణ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుందట. మరి రానా ప్రమోట్ చేస్తున్న ఈ కేరాఫ్ కంచరపాలెం ఏమేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.