అక్కడకెళ్లి ఐ హేట్ పాకిస్థాన్ అన్నాడు..!

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ తీసుకొచ్చింది అన్నది అందరికి తెలిసిందే. ప్రాంతీయ సినిమాగా కాకుండా ఇండియన్ సినిమా స్టామినా ఏంటో చూపించిన సినిమాగా బాహుబలి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ఎక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినా సరే రాజమౌళి టీం కు ఇన్విటేషన్ వస్తుంది. రీసెంట్ గా పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానం అందుకున్నాడు రాజమౌళి.

కరాచిలో జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు అటెండ్ అయిన రాజమౌళి అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు తెలివైన సమాధానాలు ఇచ్చాడు. పాకిస్థాన్ పై మీ అభిప్రాయాన్ని చెప్పమన్న ఓ మీడియా ప్రతినిధి అడుగగా చిన్న నాటి నుండి పాకిస్థాన్ అంటే మాకు ఎనిమీస్.. శత్రువులుగా భావించే వాళ్లమని అన్నారు. ఇక వసీం అక్రం అయితే మా బిగ్గెస్ట్ శత్రువు అనేశాడు. అయితే ఇదంతా ఒకప్పుడు.. పెద్దయ్యాక చాలా మార్పులొచ్చాయి. ఒకే రకమైన మనుషులమని రాజమౌళి చెప్పుకొచ్చాడు.