ఎన్టీఆర్ బయోపిక్.. పిలుపొస్తే తప్పక చేస్తా..!

త్రివిక్రం సినిమా షూటింగ్ కు సిద్ధమవుతున్న ఎన్.టి.ఆర్ వివో ఐపిఎల్ తెలుగు ఛానెల్ కోసం ప్రోమో షూట్ చేశాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఆ 30 సెకన్ల ప్రోమోలో కూడా ఎన్.టి.ఆర్ తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ ప్రోమో రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ ప్రస్థావన తెచ్చారు మీడియా ప్రతినిధులు.

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే చేస్తారా అంటే అక్కడ నుండి పిలుపొస్తే తప్పకుండా చేస్తా అన్నాడు ఎన్.టి.ఆర్. అయితే కొన్నాళ్లుగా బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఎవరికి వారుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఎందుకు ఏంటి అన్నది పూర్తిగా తెలియకున్నా మొన్న జరిగిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి కూడా ఎన్.టి.ఆర్ కు ఇన్విటేషన్ పంపలేదట బాలకృష్ణ. మరి ఈ ఇద్దరి మధ్య దూరం ఎప్పుడు తగ్గుతుందో చూడాలి.