
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా చిట్టిబాబుకి ఫిదా అయ్యాడు. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన రాం చరణ్ రంగస్థలం సినిమా చూసిన వర్మ సినిమాలో రాం చరణ్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అని.. సినిమా ట్రూలీ సెంటర్ స్టేజ్ బుల్లెట్ అచీవ్ మెంట్ అని ట్వీట్ చేశారు వర్మ. ఇక సుకుమార్ కు 3 నమస్కారాలు, 3 ముద్దులు అని కూడా పెట్టారు.
రీలీజ్ నాటి నుండి రంగస్థలం సినిమా సెలబ్రిటీస్ నుండి కూడా ప్రశంసలు అందుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమా హిట్ లో ప్రధాన బలం అవ్వగా ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో రాం చరణ్ సత్తా ఏంటో చూపిస్తుంది.