
తెలుగు అమ్మాయిల మీద ఇండస్ట్రీ కోణాన్ని వేలెత్తి చూపిస్తూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న శ్రీ రెడ్డి నిన్న ఏకంగా కొమ్ములున్న శేఖరుడు.. బక్క పలచని వాడు.. గాలొస్తే ఎగిరిపోతాడంటూ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేసింది. ఫేస్ బుక్ లో ఇలా పోస్ట్ పెట్టిందో లేదో అందరు శేఖర్ కమ్ముల కూడా ఇలాంటి వాడా అంటూ ముక్కున వేలేసుకున్నారు.
అయితే శేఖర్ కమ్ముల ఈ విషయంపై సీరియస్ గా స్పందించారు. అసలు తన ముఖం కూడా నాకు తెలియదు అలాంటిది తన మీద ఇలాంటి అభియోగాలు చేస్తుందా ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటూ ఫైర్ అయ్యారు. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదంటూ సీరియస్ అయ్యారు. నిజంగానే కూల్ దర్శకుడిగా కాస్త కూస్తో మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని షాక్ కు గురి చేశాయని చెప్పొచ్చు.