
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ఏప్రిల్ 7న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ముందు వైజాగ్, విజయవాడ అంటూ హడావిడి చేసిన చిత్రయూనిట్ ఫైనల్ గా హైదరాబాద్ లోనే ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తాడన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు కేవలం ఎన్.టి.ఆర్ మాత్రమే కాదు రాం చరణ్ కూడా ఈ ఈవెంట్ కు సర్ ప్రైజ్ గెస్ట్ గా వస్తాడని అంటున్నారు.
ఎన్.టి.ఆర్, మహేష్, రాం చరణ్ ముగ్గురు ఒకే వేదిక మీద కనిపిస్తే ఇక ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించేసుకోవచ్చు. కొరటాల కోసం ఎన్.టి.ఆర్, నమ్రత కోరిక మేరకు చరణ్ ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయట. రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న రాం చరణ్ ను విష్ చేస్తూ నమ్రత భరత్ ఈవెంట్ కు రావాల్సిందిగా కోరిందట. ఎన్.టి.ఆర్ కు మహేష్ ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడని టాక్. మరి ఈ ఇద్దరు అతిథులు నిజంగానే వస్తారా లేదా అన్నది చూడాలి.