ఇక నుండి వారి కోసం సినిమా చేయను : చరణ్

రంగస్థలంతో సూపర్ సక్సెస్ అందుకున్న రాం చరణ్ ఇక నుండి ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయనని చెప్పేశాడు. రంగస్థలం సినిమా హిట్ తర్వాత చరణ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ అనుకోవచ్చు. సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా మాట్లాడిన చరణ్ ఇక నుండి ఫ్యాన్స్ కోసం మాత్రం సినిమాలు చేయనని చెప్పాడు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని వారికి నచ్చినట్టే సినిమాలు చేయాలంటే మాత్రం రంగస్థలం సినిమా వచ్చేది కాదని అంటున్నాడు చరణ్.

కథ నచ్చాల్సింది మాకు.. మాకు నచ్చితే అభిమానులకి, ఫ్యామిలీకి అందరు గర్వపడే సినిమాలు వస్తాయి. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ హీరోని కాదని అంటున్నాడు. రంగస్థలం లాంటి క్రేజీ విజన్ ను ఆలోచించి తెరకెక్కించిన సుక్కూకి థ్యాంక్స్. సినిమా విజయం సాధించింది అన్న దాని కన్నా సినిమా కొన్న వారు లాభాలు పొందుతున్నారు అన్న వార్త విని సంతోషం కలిగిందని అన్నాడు. ఇక నుండి ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా సినిమాలు తీస్తేనే బెటర్ మరి ఇక నుండి చరణ్ ఇదే పద్ధతి కొనసాగిస్తాడో లేదో చూడాలి.