చిట్టిబాబుకి ఎన్టీఆర్ ప్రశంస..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలో రాం చరణ్ నటనకు అందరు ప్రశంసలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా తన స్పందన తెలియచేశాడు. ఇంతకీ ఎన్.టి.ఆర్ ఏమన్నాడు అంటే సినిమా చాలా అద్భుతంగా ఉందని.. ఆ పాత్ర రాం చరణ్ తప్ప ఎవరు చేయలేరని.. చిత్ర దర్శకుడు సుకుమార్ ను పొగుడుతూ ట్వీట్ చేశాడు.     

ఇక ఈ సినిమా చూసిన రానా కూడా రంగస్థలం సినిమా చూశాను.. రాం చరణ్ చక్కగా నటించాడు. మంచి ప్రొడక్షన్ డిజైన్ తో అద్భుతంగా తీశారని ట్వీట్ చేశాడు రానా. సుకుమార్ డైరక్షన్ తో ఆకాలానికి తీసుకెళ్లాడని అన్నాడు రానా. సమంత, ఆది, జగపతి బాబు అందరు బాగా నటించారని ట్వీట్ చేశాడు. రాం చరణ్ అభినయానికి సెలబ్రిటెస్ అంతా తమ రెస్పాన్స్ అందిస్తున్నారు.