
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్నా ఈ సినిమాలో 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. బుర్జి ఖలీఫా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఎతిహాద్ టవర్స్ దగ్గర ఈ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారట. మొదట ఈ లొకేషన్స్ లో షూటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే రియల్ లొకేషన్స్ కావాలనే ఉద్దేశంతో వారి పర్మిషన్ కోసం వెయిట్ చేశారు.
ఫైనల్ గా వారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని మరి షూటింగ్ కు సిద్ధమవుతున్నారట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్సీ బేట్స్ ఈ సినిమాకు స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడట. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది. సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ నటించింది. దుబాయ్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగబోతుంది. నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు.