
ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ముఖానికి మేకప్ వేసాడండోయ్. మొన్నటి బ్రూస్లీ సినిమాలో తళుక్కున మెరిసి, ఇప్పుడు తన పూర్తి స్థాయి తడాఖా చూపించడానికి సిద్ధమవుతున్నాడు.
తమిళ్ లో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి, ప్రస్తుతం కత్తిలాంటోడు అనేది వర్కింగ్ టైటిల్ గా తెలుస్తోంది. ఇవాళే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాలో మెగా స్టార్ చాలా కాలం తర్వాత కలర్ ఫుల్ గా కనిపించాడు. ముఖ్యంగా తన మేకప్ చూస్తే అప్పుడెప్పుడో చూడాలని ఉంది టైం లో, బాసు ఎంత మాస్ గా కనబడే వాడో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తున్నాడు. మొదటి రోజు సెట్స్ పై చిత్ర దర్శకుడు వివి వినాయక్ తో పాటు, కమెడియన్ అలీ, నిర్మాత అల్లు అరవింద్ కూడా కనబడ్డారు. చుట్టూ పక్కల వాతావరణం చూస్తుంటే మంచి యాక్షన్ సీన్ తో షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ నిర్మాతగా మారుతూ, కొణిదెల ప్రొడక్షన్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో, హీరోయిన్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది.