ఎన్టీఆర్ మళ్లీ నెగటివ్ షేడ్..!

రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ లో ఎన్.టి.ఆర్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు. ఆల్రెడీ జై లవ కుశ సినిమాలో జై పాత్రలో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ తో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మరోసారి అలాంటి పాత్ర చేస్తున్నాడట.

అయితే జై లవ కుశలో హీరో ఎన్.టి.ఆర్ కాబట్టి సరిపోయింది మరి మల్టీస్టారర్ లో నెగటివ్ షేడ్స్ అంటే నందమూరి అభిమానులు నొచ్చుకునే అవకాశం ఉంది. రంగస్థలంతో ఫాంలోకి వచ్చిన రాం చరణ్ ఈ మల్టీస్టారర్ తో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి ఈ టైం లో ఎన్.టి.ఆర్ ఈ సాహసం ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించాలి. అయితే బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.