
మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా నిన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాలో చరణ్ చేసిన చిట్టిబాబు నటన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రీమియర్స్ ద్వారానే సినిమా వసూళ్ల హంగామా సృష్టించగా అప్పటికే 1 మిలియన్ క్రాస్ చేసింది రంగస్థలం. ఇక మొదటి రోజు మొత్తంగా 45 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేశాడు చిట్టిబాబు. అంటే 19.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందన్నమాట. చరణ్ కెరియర్ లో మొదటి రోజు కలక్షన్స్ లో రంగస్థలం హయ్యెస్ట్ రికార్డ్ సాధించింది. ఈ లెక్క చూస్తుంటే చిట్టిబాబు రంగస్థలం రీ సౌండ్ బాగానే వచ్చినట్టు తెలుస్తుంది.