
మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా యూఎస్ లో గురువారం రాత్రికే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రీమియర్ షోస్ నుండే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్లతో కూడా హంగామా సృష్టిస్తుంది. ఇప్పటికే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయగా సినిమా టాక్ బాగుంది కాబట్టి కచ్చితంగా రికార్డ్ వసూళ్లే సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రీమియర్ కలక్షన్స్ లో హయ్యెస్త్ కలక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో 6వ స్థానంలో నిలిచింది రంగస్థలం. చిట్టిబాబుగా రాం చరణ్ తన నట విశ్వరూపం చూపించగా పర్ఫెక్ట్ స్టార్ కాస్టింగ్ తో సర్ ప్రైజ్ హిట్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రంగస్థలం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చూస్తుంటే చరణ్ కెరియర్ లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టేలా కనిపిస్తుంది.