
డీజే తర్వాత హరీష్ శంకర్ ఓ క్రేజీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దాగుడుమూతలు అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. దిల్ రాజు బ్యానర్లోనే ఈ సినిమా తెరక్కెకుతుందని అంటున్నారు. అయితే ముందు నాని, శర్వా హీరోలుగా అనుకున్నా నాని ప్లేస్ లో నితిన్ వచ్చి చేరాడు. నితిన్, శర్వానంద్ హీరోగా మల్టీస్టారర్ మూవీగా రాబోతుంది దాగుడుమూతలు.
సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే సినిమాల తర్వాత దిల్ రాజు బ్యానర్లో హరీష్ శంకర్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇదని చెప్పొచ్చు. సినిమా ఎలా తీస్తే ఆడియెన్స్ మెప్పు పొందుతుందో తెలిసిన కొంతమంది దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. అయితే అతనివి రొటీన్ కథలే అన్న టాక్ కూడా ఉంది. మరి ఈ దాగుడుమూతలు సినిమా అయినా హరీష్ పై ఉన్న ఈ రొటీన్ రూమర్ మారుతుందేమో చూడాలి.