
సూపర్ స్టార్ మహేష్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రాబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. కొరటాల శివ డైరక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న భరత్ అనే నేను సినిమా ఆడియో ఏప్రిల్ 7న హైదరాబాద్ లో జరుగనుంది. ఈ ఆడియో వేడుకకు ఎన్.టి.ఆర్ అటెండ్ అవబోతున్నడని టాక్. అదే జరిగితే ఎన్.టి.ఆర్, మహేష్ కలిసి అటెండ్ అయ్యే అరుదైన వేదిక ఇదే అవుతుంది.
కోలీవుడ్ లో అవార్డ్ ఫంక్షన్ అంటే అందరు అటెండ్ అవుతారు కాని మన దగ్గర మాత్రం అలా ఉండదు. ఎవరు అవార్డ్ విన్ అవుతారో వారు మాత్రమే వస్తారు. అయితే ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ లో అయినా సరే ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి కలిసి సందడి చేస్తే బాగుంటుంది. మహేష్ తో సాన్నిహిత్యంతో పాటుగా కొరటాల శివకు చాలా క్లోజ్ కాబట్టి ఎన్.టి.ఆర్ ఈ ఆడియోకి అటెండ్ అవుతాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.