వై.ఎస్.ఆర్ 'యాత్ర'లో స్టార్ కాస్టింగ్..!

దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ ఆనందో బ్రహ్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహి వి రాఘవ్ డైరక్షన్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో వై.ఎస్.ఆర్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారని తెలిసిందే. 


ఇక మిగతా స్టార్ కాస్ట్ కూడా ఫైనల్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. వై.ఎస్ సతీమణి విజయమ్మగా శరణ్యను ఫైనల్ చేయగా. షర్మిలా పాత్రలో నయనతార, జగన్ మోహన్ రెడ్డిగా విలక్షణ నటుడు సూర్య నటిస్తున్నాడట. ఈ స్టార్ కాస్ట్ చూస్తే సినిమా రేంజ్ ఏంటన్నది తెలుస్తుంది. 30 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.