
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఆడియో మొన్నటిదాకా వైజా, విజయవాడలో అంటూ ప్రచారం జరిగింది. అయితే ఫైనల్ గా ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లోనే ఆడియో రిలీజ్ చేస్తున్నారట. వైజాగ్ లో ఆడియో ప్లాన్ చేసినా ఎందుకో వెనక్కి తగ్గారు. ఇక కొత్త రాజధానిలో అయితే ఆడియో ఈవెంట్ చేద్దామని అనుకోగా అది కుదరలేదు.
ఇప్పుడు ఈ సినిమా ఆడియో హైదరాబాద్ లో శిల్పకళావేదికలోనే రిలీజ్ చేస్తున్నారట. ఏప్రిల్ 7న ఈ సినిమా ఆడియో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాగ్ భరత్ అనే నేను ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 20న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తున్నాడు.