పాకిస్థాన్ వెళ్తున్న రాజమౌళి..!

బాహుబలి సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఆ సినిమా ద్వారా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇండియన్ సినిమా చరిత్రలో ఓ గొప్ప సినిమాగా మిగిలిన బాహుబలి ప్రదర్శించని ఫిల్మ్ ఫెస్టివల్ లేదని చెప్పాలి. చివరగా పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా బాహుబలి ప్రదర్శించబడుతుంది. దీనికి సంబందించిన ఇన్విటేషన్ అందుకున్నాడట రాజమౌళి.

ఆ విషయాన్నే తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. కరాచిలో జరుగనున్న ఈ సినిమా ఫెస్ట్ కు ప్రపంచ నలుమూలల నుండి గొప్ప టెక్నిషియన్స్ అటెండ్ అవుతారు. అయితే రాజమౌళికి ఆ ఫెస్టివల్ కు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతూ ఇన్విటేషన్ పంపడం విశేషం. దాదాపు చాలా దేశాలని చూపించిన బాహుబలి ఇప్పుడు పాకిస్థాన్ వెళ్లడంపై ఎక్సైటింగ్ గా ఉన్నాడు.