కేటిఆర్ ప్రశంసలు అందుకున్న సమంత..!

సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ గా సమంత ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. అందుకే సమంతను తెలంగాణా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేశారు. అయితే బ్రాండ్ అంబాసిడర్ గా సమంత చేనేత కార్మికులను కలుసుకుని ప్రమోట్ చేయడం జరిగింది. సమంత సపోర్ట్ ను తెలంగాణా మంత్రి కే.టి.ఆర్ ప్రశంసించడం విశేషం. అంతేకదు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సమంత ఈ కార్యక్రమాలన్ని చేస్తుందని ఆమెని మెచ్చుకున్నారు. 

హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రతి భామ ప్రభుత్వం తరపున అంటే కచ్చితంగా దానికి తగిన పారితోషికం డిమాండ్ చేస్తుంది. కాని సమంత మాత్రం చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఫ్రీగా వైద్యం అందేలా చేస్తున్న సమంత తెలంగాణా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా అది కూడా ఎలాంటి పారితోషికం ఆశించకుండా చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు.