రాజమౌళి #RRRలో మరో R..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి సినిమా నుండి రీసెంట్ గా వదిలిన #RRR టీజర్ సంచలనం సృష్టించింది. ఎన్.టి.ఆర్ ను ఆర్ తో సంభోదిస్తూ రామారావు అని ఫ్యాన్స్ పిలిచేలా చేసిన జక్కన్న సినిమాలో విలన్ గా కూడా మరో 'R'ను జత చేస్తున్నాడట. ఇంతకీ ఈ క్రేజీ మల్టీస్టారర్ లో విలన్ గా చేసేది ఎవరు అంటే యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ అని తెలుస్తుంది.

ఈమధ్యనే గరుడవేగతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ సరైన కథ కథనాలు వస్తే విలన్ గా అయినా సరే ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా అన్నాడో లేదో రాజమౌళి దృష్టిలో పడ్డాడు. ఒకవేళ నిజంగానే రాజశేఖర్ కు ఈ ఛాన్స్ వస్తే ఆయన కెరియర్ కు ఇది మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతుంది.