రంగస్థలం సెన్సార్ రిపోర్ట్..!

రాం చరణ్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం ఈ నెల 30న రిలీజ్ అవుతుంది. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. అంతేకాదు సెన్సార్ టాక్ ప్రకారం చూస్తే సినిమా కూడా హిట్ అన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చిట్టిబాబుగా రాం చరణ్ తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడని అంటున్నారు.

సమంత కూడా సహజ నటనతో ఆకట్టుకుంటుందట. ఒక్కసారిగా ప్రేక్షకులందరిని 1985 కాలం నాటి పరిస్థితులకు తీసుకెళ్లేలా సుకుమార్ స్క్రీన్ ప్లే ఉంటుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు దేవి అందించిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. సెన్సార్ నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న రంగస్థలం ఆ అంచనాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.