
బాహుబలి తర్వార రాజమౌళి ఎన్.టి.ఆర్, చరణ్ లతో మెగా మల్టీస్టారర్ షురూ చేశాడు. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమా కథ విషయంలో మెగాస్టార్ గుర్రుగా ఉన్నాడట. చరణ్ కు సంబందించిన ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే చిరు ఆమోదం ఉండాల్సిందే. స్క్రిప్ట్ దశ నుండ్ సినిమా ఫైనల్ అవుట్ పుట్ వరకు మెగాస్టార్ ఓకే అంటెనే అది ఓకే అయినట్టు.
అయితే రాజమౌళి మాత్రం అందుకు విరుద్ధం. చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ లో కేవలం చరణ్ పోర్షన్ వరకే చెప్పి ఊరుకున్నాడట. ఎన్.టి.ఆర్ పోర్షన్ ఎలా ఉంటుందన్నది మాత్రం రివీల్ చేయలేదట. అందుకు చిరు కాస్త అసంతృప్తిగా ఉన్నాడని టాక్. మాములు దర్శకులు అయితే మెగాస్టార్ అడగకముందే చరణ్ ప్రాజెక్ట్ డీటైల్స్ చెప్పేస్తారు. కాని జక్కన్న విషయంలో మెగాస్టార్ అయినా సరే తన లెక్క తనదే అంటున్నాడట. చరణ్ ఇమేజ్ కు ఏమాత్రం ఇబ్బందు కాకుండా రోల్ ఉంటుందని మాత్రం హామీ ఇచ్చాడట.