
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ఖైది నంబర్ 150 హిట్ తో మరింత జోష్ పెంచుకున్న చిరు ప్రస్తుతం సైరా నరసిం హారెడ్డి సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ రంగస్థలం డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్ వచ్చింది.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పేశాడు సుకుమార్. చిరు అభిమానిగా ఆయన్ను డైరెక్ట్ చేయాలని ఆశగా ఉంది కాని తాను చిరుకి తగిన కథ ఇంతవరకు అనుకోలేదని. అలాంటిది అసలు కథ ఎలా చెబుతానని అంటున్నాడు సుక్కు. మొత్తానికి సుకుమార్ కూడా చిరుతో సినిమా చేసే దర్శకుల లిస్ట్ లో చేరాడు. సైరా తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలని చూస్తున్న మెగాస్టార్ రంగస్థలం రిజల్ట్ తర్వాత కచ్చితంగా సుకుమార్ తో సినిమా లైన్ లో పెడతాడని అంటున్నారు.