
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న బడ్జెట్ తో అద్భుత విజయాలను అందించేలా విజయ్ వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ట్యాక్సీ వాలా రాహుల్ సంక్రుత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. ట్యాక్సీ వాలా ఫస్ట్ గేర్ అంటూ ఓ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది.
విజయ్ ను ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటున్నారో అలానే ఇందులో ఉన్నాడు. మరి ఈ ట్యాక్సీ వాలా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈమధ్యనే ఛలో అంటూ డెబ్యూ మూవీతో సూపర్ హిట్ అందుకున్న కన్నడ భామ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మే 18న రిలీజ్ కన్ఫాం చేసుకున్న ఈ సినిమా అర్జున్ రెడ్డి సంచలనాలు రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.