దిల్ రాజు చేతుల్లోకి మెహబూబా..!

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో తనయుడు ఆకాష్ పూరి హీరోగా వస్తున్న సినిమా మెహబూబా. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో 1971లో జరిగిన ఇండో పాక్ నేపథ్యంలోని ప్రేమకథతో వస్తుంది. ఇక మొన్నామధ్య సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తప్పకుండా పూరి మళ్లీ సినిమాతో తన సత్తా చాటుతాడని అనుకుంటున్నారు.

ఇక సినిమా పూర్తయినా సరే రిలీజ్ డేట్ కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు పూరి. అంతేకాదు సినిమా ఎవరు కొనే పరిస్థితి లేదన్న టాక్ కూడా వచ్చింది. అయితే పూరి మాత్రం ఫైనల్ గా బడా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో చేతులు కలిపాడు. ఎంతమొత్తానికి డీల్ సెట్ అయ్యిందో తెలియదు కాని మెహబూబా ప్రపంచవ్యాప్తంగా దిల్ రాజు చేతుల్లోకి వచ్చేసిందట. మే 11న సినిమా రిలీజ్ క్లియరెన్స్ ఇస్తుందట. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.