
దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా యాత్ర. వై.ఎస్.ఆర్ గా మమ్ముట్టి నటిస్తున్న ఈ సినిమాలో జగన్ మోహన్ రెడ్డిగా ఎవరు నటిస్తారు అన్నది ఇంకా తెలియలేదు. కాని ఈ సినిమాలో జగన్ భార్య భారతి పాత్రలో మాత్రం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుందని టాక్. ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెతో సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది.
బయోపిక్ సినిమాలలోనే భారీ బడ్జెట్ గా వస్తున్న ఈ సినిమా దాదాపు 30 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలు ఆరాధించే నాయకుడు వై.ఎస్.ఆర్ చరిత్ర గురించి తెలిసిన విషయాలతో పాటుగా ఎవరికి తెలియని విషయాలను ఈ సినిమాలో ప్రస్థావించడం జరుగుతుందట. ఈ సినిమాను 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించి ఫైనల్ కాస్టింగ్ గురించిన మిగతా సమాచారం త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.