
టీజర్ తోనే ఈసారి సంచలనాలు పక్కా అని బల్ల గుద్ది మరి చెప్పేలా చేశాడు సూపర్ స్టార్ మహేష్. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో భరత్ అనే నేను సినిమా చేస్తున్న మహేష్ ఈమధ్యనే ఆ సినిమా టీజర్ అదేనండి విజన్ ఆఫ్ భరత్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ టీజర్ అంచనాలను మించి కాదు అంతకంటే ఎక్కువ రేంజ్ లో ఉంది. అందుకే టీజర్ తోనే సంచలనాలు మొదలయ్యాయి.
ఇండియన్ సినిమాలో కాదు వరల్డ్ సినిమాల్లోనే అత్యధిక వ్యూయర్ కౌంట్ సాధించిన సినిమాల్లో భరత్ అనే నేను సెకండ్ ప్లేస్ లో ఉంది. మొత్తంగా విజన్ ఆఫ్ భరత్ 14 మిలియన్స్ వ్యూయర్ కౌంట్ తో సంచలనం సృష్టించింది. 1.60 లక్షల లైకులను సాధించింది. ఇక దీనికంటే ముందు మరో ఇండియన్ సినిమా టీజర్ హయ్యెస్ట్ వ్యూయర్ కౌంట్ సాధించింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్. ఆ సినిమా టీజర్ ఏకంగా 38 మిలియన్ వ్యూయర్ కౌంట్ సాధించగా 10 లక్షల లైకులు సాధించింది. అంటే వరల్డ్ టీజర్ రికార్డులలో మొదటి స్థానం విజయ్ ది.. రెండవ స్థానం మహేష్ దని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే మహేష్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.