
ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు అంటే అందులో ఒక హీరోకి ఎక్కువ మరో హీరోకి తక్కువ పాత్ర ఇస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడతారు. ఇప్పుడు ఇదే డౌట్ మెగా నందమూరి మల్టీస్టారర్ గా రాబోతున్న రాం చరణ్, ఎన్.టి.ఆర్ సినిమాకు వస్తుంది. రాజమౌళి ఈ సినిమా ఎలా హ్యాండిల్ చేస్తాడు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు.. ఎవరిని తక్కువ చేస్తాడు అని కన్ ఫ్యూజ్ అయ్యారు.
అయితే సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా ఇద్దరు స్టార్ హీరోస్ సమానమైన పాత్రలుంటాయని ఇండికేట్ చేశాడు జక్కన్న. ట్రిపుల్ ఆర్ అంటూ సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటుగా ఆడియెన్స్ అందరిని ఆశ్చర్యపరచాడు. #RRR అంటే రాజమౌళి, రాం చరణ్, రామారావు అని.. ఈ ముగ్గురు కలయికలో వస్తున్న ఈ మల్టీస్టారర్ తెలుగు సినిమా చరిత్రలో ఓ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని చెప్పొచ్చు.