కత్తి మహేష్.. లింగబాబు లవ్ స్టోరీస్..!

పవన్ కళ్యాణ్ విమర్శించి వార్తల్లో నిలిచిన క్రిటిక్ కత్తి మహేష్ ఇప్పుడు తన ఫోకస్ మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఓ సినిమాను డైరెక్ట్ చేసిన అతను ఇప్పుడు లింగబాబు లవ్ స్టోరీస్ అంటూ ఓ వెబ్ సీరీస్ కు సిద్ధమయ్యాడు. దానికి సంబందిచిన టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది పెద్దల సినిమాగా అనిపిస్తుంది. అందుకే ముందు ఓ డైలాగ్ కూడా పెట్టాడు.

పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన కత్తి మహేష్ కచ్చితంగా ఇలాంటి వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ఎవరు ఊహించి ఉండరు. లింగబాబు లవ్ స్టోరీస్ అంటూ పక్కింటి ఆంట్రీ, నర్స్, మరదలు అంటూ స్నేహితులతో చెప్పుకునే కథలే ఈ వెబ్ సీరీస్ కాన్సెప్ట్. అయితే ఎన్ని ఎపిసోడ్స్ ఉంటుందో ఏమో కాని ఈ వెబ్ సీరీస్ టీజర్ మాత్రం ఓ బి గ్రేడ్ సినిమా తలపిస్తుంది. మరి కత్తి ఇలా అయినా సరే తన టాలెంట్ చూపిస్తాడేమో చూడాలి.