చరణ్ రంగస్థలం భారీ స్కెచ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా నిర్మాతలు పెద్ద స్కెచ్ వేశారట. సాధారణంగా పెద్ద సినిమాలన్ని సాధ్యమైనంత వరకు భారీ రేంజ్ లో రిలీజ్ చేసి వారం లో మాక్సిమం కలక్షన్స్ రాబట్టేయాలని చూస్తారు. కాని రంగస్థలం సినిమాకు పంథా మార్చేసి సినిమా టాక్ ను బట్టి ఎక్కువ థియేటర్లు వేస్తారట.

అంచనాలున్న సినిమా అలా ఎందుకు చేస్తారు అంటే సిటీలో ఉన్న అన్ని థియేటర్లలో ఆడితే ఆ సినిమా టాక్ బాగా స్ప్రెడ్ అవుతుందని ఒకటి రెండు థియేటర్స్ లో మాత్రమే వేస్తే ఇక టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు ఉంటాయని ఈ ప్లాన్ చేశారట. సినిమా కనుక అనుకున్న అంచనాలను రీచ్ అయితే తప్పకుండా రంగస్థలం రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని తెలుస్తుంది.