
ఒకప్పుడు క్రేజీ డైరక్టర్ గా స్టార్స్ తో సినిమాలు చేసిన కృష్ణవంశీ ఇప్పుడు యువ హీరోలతో వరుస ఫ్లాపులు తీస్తున్నాడు. కృష్ణవంశీ రీసెంట్ మూవీ నక్షత్రం కూడా ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. కాలం చెల్లిన కథలను అదేవిధంగా స్క్రీన్ ప్లే తో వస్తున్న కెవికి కాస్త బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. అయితే ఈమధ్యనే ఓ లైన్ తో భళ్లాలదేవ రానాని కలిశాడట.
లైన్ నచ్చి డెవలప్ చేయమనగా అది కూడా సిద్ధం చేసుకున్న కృష్ణవంశీ మళ్లీ రానాని కలిశాడట. అయితే పూర్తి స్క్రిప్ట్ విన్న రానా కృష్ణవంశీకి సారీ అని చెప్పేశాడట. ఏమాత్రం కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేకుండా మొహమాటం లేకుండా కృష్ణవంశీకి కాదని చెప్పేశాడట. మరి రానా కాదనేసిన కథను ఎవరితో చేస్తాడో చూడాలి.