ఛలో డైరక్టర్ హీరోని మార్చేశాడా..!

నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛలో. కెరియర్ లో స్ట్రాంగ్ హిట్ పడాల్సిన టైంలో నాగ శౌర్య వేసిన ఈ డేర్ స్టెప్ అతనికి సూపర్ క్రేజ్ తీచుకొచ్చింది. ఛలో సినిమా ముఖ్యంగా దర్శకుడి ప్రతిభను మెచ్చుకునేలా చేసింది. సినిమా ఎలా తీస్తే ఆడియెన్స్ మెప్పు పొందుతుందో అని వెంకీ బాగా చూపించాడు.

ఇక ఈ సినిమా తర్వాత వెంకీ తన సెకండ్ సినిమా నితిన్ తో ఓకే చేసుకున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషంస్ అధినేత రాధాకృష్ణ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మించాలని చూశారు. అయితే ఈ సినిమా కథ సిద్ధం చేసే క్రమంలో ఇది నితిన్ కన్నా నిఖిల్ కు అయితే బాగుంటుందని అనుకున్నారట. అందుకే ఇప్పుడు వెంకీ నితిన్ బదులు నిఖిల్ తో ఆ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. నితిన్ కాదంటే నిఖిల్ దగ్గరకు వెళ్లడం ఓకే కాని నితిన్ ఓకే చెప్పినా తనతో కాకుండా మరో హీరోతో చేయడం అంటే మరి అతన్ని ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.