కన్నడ సినిమాపై బాలయ్య కన్ను..!

నందమూరి నట సింహం బాలకృష్ణ 100వ సినిమా శాతకర్ణి చేసిన నాటి నుండి వరుస సినిమాలను చేస్తూనే ఉన్నాడు. పైసా వసూల్, జై సింహా తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన బాలయ్య ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ కు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 29 నుండి ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత సినిమా కూడా చర్చల దశల్లో ఉందని తెలుస్తుంది. 

ముఖ్యంగా ఈసారి బాలయ్య ఓ కన్నడ సినిమా రీమేక్ చేస్తారని టాక్. కన్నడలో శివ రాజ్ కుమార్ హీరోగా చేసిన ముఫ్టి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తెలుగు రీమేక్ గా బాలయ్య చేయాలని చూస్తున్నాడట. సినిమాలో హీరో అండర్ కవర్ కాప్ గా కనిపిస్తాడు. గ్యాంగ్ స్టర్ తో ఆడే ఆటే ముఫ్టి. పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా ఈ సినిమా కన్నడలో సూపర్ కలక్షన్స్ తెచ్చుకుంది. ఆ సినిమా రీమేక్ లో బాలయ్య నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాలి.