
ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న క్రేజీ హీరోయిన్ ఎవరంటే అందరికి గుర్తొచ్చేది రాశి ఖన్నానే. జై లవ కుశ, టచ్ చేసి చూడు, తొలిప్రేమ ఇలా వరుస సినిమాలతో హుశారెత్తించేస్తున్న రాశి ఖన్నా ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది. తొలిప్రేమ సినిమాలో అయితే అమ్మడి నటనకు అందరు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటుగా సమానంగా నటించింది రాశి ఖన్నా.
ఇక ఇప్పుడు అమ్మడు తమిళంలో కూడా క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పూరి కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమా కోలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. విశాల్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాను సెలెక్ట్ చేసుకున్నారు. మురుగదాస్ కో డైరక్టర్ గా పనిచేసిన వెంకట్ మోహన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మరి విశాల్ తో రాశి ఖన్నా చూపించే టెంపర్ అక్కడ అమ్మడికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.