సుకుమార్ బన్ని.. ఆర్య-3కి సిద్ధమా..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో సుకుమార్ కూడా ఒకరు. తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుక్కు ప్రస్తుతం రాం చరణ్ తో రంగస్థలం సినిమా తీశారు. ఈ నెల చివరన సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా టైం లో సుకుమార్ వర్కింగ్ స్టైల్ నచ్చిన చరణ్ ఈ డైరక్టర్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే అది వెంటనే కాదని తెలుస్తుంది.

రంగస్థలం తర్వాత సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఆర్యతో దర్శకుడిగా సుకుమార్ కు లైఫ్ ఇచ్చిన బన్ని తనకు ఓ స్టార్డం వచ్చేలా చేసుకున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియెన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉంటాయి. ఆర్య, ఆర్య-2 తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రెజెంట్ బన్ని కూడా నా పేరు సూర్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.