రంగస్థలం టైటిల్ సాంగ్.. చెర్రి అదరగొట్టాడు..!

రాం చరణ్ రంగస్థలం నుండి టైటిల్ సాంగ్ ఆడియో ఎప్పుడో రిలీజ్ అవగా ఆ సాంగ్ కు సంబందించిన వీడియో ప్రోమో ఈరోజు రిలీజ్ చేశారు. సాంగ్ ఎంత జోష్ గా ఉందో చరణ్ డ్యాన్స్ కూడా అంతే జోష్ గా ఉంది. వినపడని చిట్టిబాబు వినిపించే పాట పాడటం అది కూడా హుశారెత్తించేలా ఊగడం ఫ్యాన్స్ ను ఉత్సాహపరచింది. ఇంట్రో సాంగ్ గా అనిపిస్తున్న ఈ సాంగ్ కలర్ ఫుల్ గా ఉంది.

సాంగ్ ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే ఇక సాంగ్ మొత్తం దుమ్ముదులిపేసిందని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఈ సినిమా చాలా ప్రత్యేకతగా కనిపిస్తుంది. చరణ్ సరసన సమంత నటించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.