
తమిళ్ లో తని ఒరువన్ సినిమా ని ధృవ అనే టైటిల్ తో తెలుగులోకి రీమేక్ చేస్తున్న రామ్ చరణ్, తన భాగం వరకు షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అది పూర్తవగానే విరామం లేకుండా, సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
అక్టోబర్ లో మొదలవనున్న ఈ సినిమాలో చరణ్ ఇంతకు ముందు ఎప్పుడూ కనబడని కొత్త లుక్ లో కనిపిస్తాడని సమాచారం. సుకుమార్ మార్క్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ కథ, ఎప్పటిలాగే మైండ్ గేమ్ బేస్ చేస్కుని సిద్ధమవుతోంది. గత కొంత కాలంగా హిట్ తో దోబూచులాడుతున్న చరణ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా అభిమానుల అంచనాగా తెలుస్తోంది.
ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్ కోసమని కాశ్మీర్ లో చరణ్ ఉన్నారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థని ఒరువన్ కి సంగీతం అందించిన హిప్ హాప్ తమీజా, తెలుగులో ట్యూన్స్ కడుతుండడం విశేషం.