
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన సినిమా సింహాద్రి. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నిటిని పక్కన పెట్టేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణ చేసుంటే ఎలా ఉండేది. అదేంటి అంటే ముందు ఈ కథ బాలయ్య కోసం రాసుకున్నాడట విజేంద్ర ప్రసాద్ కాని బాలయ్యతో కుదరక ఎన్.టి.ఆర్ తో తీశారట.
ఈ విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ తన సోషల్ బ్లాగ్ లో స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా రివీల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ బాలయ్య ఆ సినిమా చేసుంటే ఎలా ఉండేదో అని ఊహించేసుకుంటున్నారు. సింహాద్రి సినిమా బాలయ్య చేస్తే నిజంగానే రికార్డుల లెక్క వేరేలా ఉండేది. రాజమౌళి మళ్లీ బాలకృష్ణతో తీసే ఛాన్స్ రాలేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.