కాజల్ తగ్గే సమస్యేలేదట..!

ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ లో కాజల్ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఖైది నెంబర్ 150 కంటే ముందు కెరియర్ దాదాపు ముగిసిందని అనుకున్న అమ్మడి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ మళ్లీ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్యనే అ! తో కూడా కాజల్ మరోసారి తన సత్తా చాటింది. ఇక తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ చుక్కలు చూపిస్తుందని టాక్.

మొన్నటిదాకా 1 కోటి, 1.25 కోట్లు తీసుకున్న కాజల్ ఇప్పుడు ఒక్క సినిమా 1.75 దాకా చార్జ్ చేస్తుందట. ఇక ఈమధ్యనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో ఆమెను హీరోయిన్ గా అడుగగా 2 కోట్లు ఇస్తేనే అంటూ షాక్ ఇచ్చిందట. ప్రస్తుతం ఆమెతో ఆ దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. సినిమానైనా వదులుకుంటా కాని రెమ్యునరేషన్ తగ్గించుకోవడం లాంటివి మాత్రం ఉండదని అంటుందట కాజల్ మొత్తానికి అమ్మడి ఫాం అలా కొనసాగుతుందని చెప్పుకుంటున్నారు.