ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు బయోపిక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తేజ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలయ్య తన నట విశ్వరూపం చూపించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సతీమణి బసవతారక పాత్రకు బాలీవుడ్ భామ విద్యా బాలన్ ను సెలెక్ట్ చేశారు.

అసలైతే ఆ పాత్ర కోసం ముందు నిత్యా మీనన్ ను అనుకున్నా ఆమె తిరస్కరించడంతో చిత్రయూనిట్ విద్యాతో సంప్రదింపులు జరిపింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అయిన విద్యా ఎలాంటి చాలెంజింగ్ రోల్ అయినా అవలీలగా చేస్తుంది. ఇక ఎన్.టి.ఆర్ బయోపిక్ తో తన పాత్ర చిన్నదే అయినా పాత్ర గుర్తింపుని అర్ధం చేసుకుని ఆమె ఓకే చేసిందట. మొత్తానికి ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాకు బాలీవుడ్ భామ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.