మణిరత్నం హీరోయిన్ తో వరుణ్ తేజ్..!

ఫిదా, తొలిప్రేమ సినిమాలు వరుస హిట్లు కొట్టడంతో మెగా హీరో వరుణ్ తేజ్ క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో ఓ ప్రయోగాత్మాక సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం బాగా రిస్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. స్పేస్ లో తెరకెక్కించబోతున్న ఈ సినిమా ఉంటుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మణిరత్నం హీరోయిన్ అదితి రావ్ హైదరి సెలెక్ట్ అయ్యింది.  

మణిరత్నం చెలియా సినిమాలో కార్తి సరసన నటించిన అదితి ప్రస్తుతం తెలుగులో సుధీర్ బాబు జోడిగా సమ్మోహనం సినిమాలో నటిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఓ రేంజ్ లో ఇమేజ్ సంపాదించిన వరుణ్ తేజ్ తో అదితి రొమాన్స్ అమ్మడి కెరియర్ కు హెల్ప్ అవుతుందని అంటున్నారు. బాలీవుడ్ లో రెచ్చిపోయినా లాభం లేదని తెలుసుకున్న అమ్మడు సౌత్ సినిమాలతో కెరియర్ కొనసాగించాలని డిసైడ్ అయ్యింది.