భరత్ ఆడియో డేట్ వచ్చేసింది..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 20న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ గా కూడా హిట్ అవడం గ్యారెంటీ అంటున్నారు. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తున్నాడని తెలిసిందే.

రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. 1 నేనొక్కాడినే, శ్రీమంతుడు తర్వాత మహేష్, దేవి కాంబోలో వస్తున్న ఈ సినిమా సాంగ్స్ కూడా ఫ్యాన్స్ ను అలరించేలా ఉంటాయని అంటున్నారు. మరి ఆ సందడి ఎలా ఉండబోతుందో చూడాలి.