
సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్ల్ డైరక్షన్ లో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాపై మొదటి నుండి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కథను ఓ న్యూజిల్యాండ్ వెబ్ సీరీస్ నుండి స్పూర్తి తీసుకున్నారని అంటున్నారు. ఈ న్యూస్ పై డైరక్టర్ వంశీ పైడిపల్లి స్పందించారు. అందరు అనుకున్నట్టుగా ఇది ఏ వెబ్ సీరీస్ కు స్పూర్తిగా రాసుకున్న కథ కాదని అన్నాడు.
సొంత కథతోనే ఈ సినిమా వస్తుందని.. ఏ సినిమాకు ఇది కాపీ కాని స్పూర్తి కాని కాదని క్లారిటీ ఇచ్చాడు. ఇక నిర్మాత పివిపి తో గొడవ గురించి మాత్రం వంశీ నోరు మెదపట్లేదు. దిల్ రాజు, అశ్వనిదత్ ఆ మ్యాటర్ సెటిల్ చేశారని అనుకున్నా మళ్లీ పివిపి మహేష్ 25వ సినిమాపై కోర్టుకు వెళ్లారని టాక్. సినిమా మొదలైతే గాని ఈ రూమర్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉండదు.